Welcome to BAHUJANA RASHTRA SAMITHI

bcs-and-their-political-emancipation

తెలంగాణ రాష్ట్రము లోని అన్ని నియోజకవర్గముల లోని బహుజన సోదరులకు మనవి:

అధిక సంఖ్యాకులైన మన వర్గ ప్రజలను సంఘటితము చెయ్యాల్సిన అవసరము అత్యవసరముగా మారింది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత కూడా అధిక సంఖ్యాకులైన బహుజనులు ఈసడించుకొనబడుతున్నారు. మన సంఖ్యాబలానికి ఉండాల్సిన ప్రాముఖ్యత లభించడము లేదు. మనలను ఎంగిలి బొక్కలకోసము ఆశపడుతూ వారి ముఖాలవంక చూసే జీవులుగానే లెఖ్ఖ కడుతున్నారు.
పోనీ పరిపాలన ఏమన్నా బాగుందా అంటే, ప్రభుత్వ ఆస్తులను యెడాపేడా దోచుకుంటున్నవాళ్లను చూసీ చూడనట్లుగా, వాళ్ళు దోచేది ప్రజల సొమ్ము కాదు అన్నట్లుగా, దోచుకోవడము దోపిడీ దొంగల హక్కు అన్నట్లుగా వుంది మన ప్రభుత్వము యొక్క ప్రవర్తన. పబ్లిసిటీ పటాటోపము, క్రియ కింనాస్తి! ప్రజల సొమ్మును పబ్లిసిటీ కోసము కోట్ల రూపాయల వ్యర్థము చేస్తున్నారు. నిజంగానే ఇది పని చేసే ప్రభుత్వమే అయితే ఇంత సొమ్ము వ్యర్థముగా ఖర్చు చేస్తూ సొంత డబ్బా లు కొట్టుకునే అవసరము వుందా? ప్రజల చెవులలో పొద్దున్న లేచినప్పటి నుండి గోరంతలు కొండంతలు చేసి ఊదరగొట్టడము దేనికి? మోసగాళ్లు మాత్రమే ఇలాంటి చర్యలకు పాలు పడతారని మనకు తెలియని విషయమా?
సోదరులారా మన వర్గ ప్రజలలోని అనైక్యతను, అజ్ఞానాన్ని చాతకాని తనంగా, బానిసల నైజముగా లెఖ్ఖపెడుతున్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా మానవర్గ ప్రజల ఐక్యతకోసము కృషి మొదలుపెడితే, కులాలుగా విడదీసే ప్రయత్నాలు మొదలు పెడతారు. మనము ఒక్కటి మనసులో నాటుకోవాల్సిన అవసరము వుంది. మనల్ని విడదీయడానికి వాడు ఇచ్చే తాయిలాలు, మనమే మన సంఖ్యాబలంతో సాధించుకుంటే వాడు ఇచ్చే తాయిలాల విలువ యెంత పాటిదిగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
సోదరులారా! ఆర్ధిక ఇబ్బందులకు, అపహాస్యాలకు, వెన్నుపోటులకు, ఇతరత్రా ఎన్నో బాధలకు ఓర్చుకొని మనదంటూ ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నాము. రాలిపోయే స్థితిలో ఇలాంటి పనికి చేసిన సాహసాన్ని చూసి నవ్వుకున్నారు. మహాశయులు ఫూలే, అంబేద్కర్ గార్లు సెలవిచ్చినట్లుగా నా సమాజానికి ఇది నేను చేస్తున్న సేవగా అనుకొని ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన అన్న సంతృప్తి ఉంది. కానీ దానిని సమర్థులైన యువనాయకుల చేతిలో పెట్టాలన్న అభిప్రాయముతో వెతికితే అర్హతలు ఉండీ భయపడుతూ వెనకడుగు వేస్తున్నవాళ్ళు కొందరు, ఎగేసుకొని పోవాలని చూస్తున్నవాళ్లు ఎక్కువ అయ్యిన్రు.
ఏదేమైనా సోదరులారా! 2019 లో నేను నమ్మిన సిద్ధాంతాల మీద శాసనసభ ఎన్నికలలో పాలుగొనాలంటే, వున్న 119 నియోజకవర్గాల నుండి 119 మంది బహుజన సోదరులు ముందుకు రావాలె. తమ తమ నియోజకవర్గాలలో ఇంటి ఇంటికి తిరిగి మన పార్టీ సిద్ధాంతాలను, ఐక్యంగా మన వర్గ సభ్యులను శాసన సభకు పంపించడము వల్ల మన వర్గ ప్రజల అభివృద్ధి, రాబోయే మన తరాల భవ్యమైన భవిష్యత్తు మొదలగువాటి గురించి ప్రజలకు పూస గుచ్చినట్లుగా చెప్పి మన పార్టీ గొడుగు క్రిందికి తీసుకొచ్చే ప్రయత్నము చేసి.
బహుజన యువకులారా ఈ పని చెయ్యడము ఎలాంటి సిగ్గుమాలిన పని కాదు. ఇంకెవరికో ఇలాంటి పనులు చెయ్యడము మనకు అలవాటే. ఇప్పుడింక మన వర్గముకోసము మనము కష్టపడి మనవారిని అభివృద్ధి బాటన నడుపుదాము.
ఒక్క విషయము గమనించాలి. మనము ఎన్నోరకాల వాళ్ళను ఎదురుకోవాల్సి వొస్తుంది. మనము చేసే పని మన మంచికోసమే అయినా ఎదుటివాడు మనము వాడి సొమ్ము ఏదో లాక్కునే ప్రయత్నమూ మొదలుపెడుతున్నాము అన్న భావముతో ఎన్నో రఖాలుగా అవమానిస్తాడు, ఎన్నో ఇబ్బందులు కలిగించాలని చూస్తాడు. మనము అంకిత భావముతో మనసు నొప్పించుకోకుండా మనము నిర్ణయించుకున్న దిశలో ప్రయాణము చెయ్యాలె.
సోదరులారా! దృఢచిత్తులైన భవిష్యత్ నాయకులారా!! రండి అడుగు ముందుకు వేసి మన వర్గ భవిష్యత్తు కోసం బాధ్యతలను శిరస్సుకు ఎత్తుకొండి. సంప్రదించవలసిన ఫోన్ నంబరులు: 8121171208, 8008398511. email: lingamas@gmail.com, ak16mu@gamil.com వెబ్ సైట్ brs.org.in నా చిరునామా: ప్లాట్ నంబర్. 34/2, లలితానగర్, వెస్ట్ మారేడ్పల్లి, సికిందరాబాద్. 500 026.

తెలంగాణ లోని పేద వర్గ ప్రజలకు, ఓటరు మహాశయులకు విన్నపము:
పేదవాడు ఎదగాలంటె పేదవాడి ప్రభుత్వము రావాలె.
బహుజన రాష్ట్ర సమితి పేదవాళ్ళ అభివ్రుద్ధి కోసము పేదవాళ్ళచేత ఏర్పాటు చెయ్యబడ్డ పేదవాళ్ళ పార్టీ.
కేంద్ర ఎన్నికల కమీషను, పార్టీకి తమ లెటర్ F. No. 56/215/LET/ECI/FUNC/PP/PPS-I/2016/64 Dt. 30-03-2017 ద్వారా గుర్తింపు కలిగించింది.
ఏదైనా నియోజకవర్గములో వోటరులు తలా పది రూపాయలు (పది వేల మందికి తగ్గకుండా) బహుజన రాష్ట్ర సమితి ద్వివార్షిక సభ్యత్వ రుసుము కట్టి తమ నియోజకవర్గ ప్రజాప్రతినిధిని (MLA) ప్రతిపాదించి ఎన్నికలలో పోటీ చేయడానికి అతని పేరు మీద పార్టీ టికెట్ పొందగలరు.
అక్రమ సభ్యత్వ సూచీలను నివారించడానికి మన పార్టీ ప్రతీ సభ్యులను గురించిన ఈ క్రింది వివరములను రిజిస్టరులో ఒకే లైన్ లో తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుంది.
ఓటరు పేరు-ఓటరు తండ్రి/భర్త పేరు-ఓటరు ID కార్డు నం-ఓటరు ఫోన్ నం-ఇనీషియల్స్.
మీ చేత ఎన్నుకోబడ్డ మీ ప్రతినిధికి మీ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన వనరులన్నీ కలిపించబడును.
మీ ప్రతినిధి (MLA) ప్రాథమిక విధి, తన నియోజకవర్గములోని ప్రతీ వ్యక్తికి వారి వారి సామర్థ్యమును బట్టి పని కలిపించడము. (నిర్మాణ రంగము, పారిశ్రామిక రంగము, వ్యాపార రంగము మొదలగు ప్రభుత్వ పనులలో).
ప్రభుత్వ ఆస్తులను కాపాడడము.
గ్రామ గ్రామానికి ఉచిత భోజన శాలలను ఏర్పాటు చెయ్యడము, వాటి సక్రమ నిర్వహణను కనిపెడుతూ ఉండడము.
వ్యవసాయ వనరులను, (సారవంతమైన ప్రభుత్వ భూములలో కూడా వ్యవసాయమును అనుమతిస్తూ) అభివృద్ధి చెయ్యడము,
సామూహిక వ్యవసాయమును ప్రోత్సహించడము,
వ్యవసాయానికి కావాల్సిన వడ్డీ రహిత ఆర్ధిక వనరులను అవసరము వున్నవారికి అందరికి నిష్పక్షపాతముగా అందించడము, వ్యవసాయోత్పత్తుల ద్వారా రైతులకు లాభసాటి వసతులను గోదాముల ఏర్పాటు గావించి, వీలయితే కుటీర పరిశ్రమల ఏర్పాటు ద్వారా కలిపించడము,
ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల పని తీరును గమనిస్తూ, వాటికి అవసరమైన భవనాల నిర్మాణము (సంక్షేమ సంఘాల ద్వారా), అభివృద్ధి చెందుతున్న ఆధునిక విద్యా విధానాల అమలు,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, అవసరమున్నంత మంది సేవాభావమున్న వైద్యుల నియామకం, వారి సహాయకుల నియామకము, వైద్యుల యొక్క, రోగుల యొక్క రవాణాకు అవసరమైన వాహనములు, మందులను అందుబాటులో ఏర్పాటు చెయ్యడము (సంక్షేమ సంఘము వారి డిమాండ్ ని బట్టి) మీ ప్రతినిధియొక్క (MLA) బాధ్యత.
ఇవన్నీ పనులను పార్టీ ఏర్పరిచే గ్రామ, మండల సంక్షేమ సంఘాల ద్వారా అమలు చేసే బాధ్యత మీ ప్రతినిధిది.
ప్రజలు, తరువాతి కాలములో తమ ప్రతినిధి (MLA) అధికార దుర్వినియోగానికి గాని, అవినీతికి గాని, నిర్లక్ష్యానికి గాని పాలుపడుతున్నట్లుగా గ్రహించి పార్టీకి ఫిర్యాదు చేసినట్లయితే అతని అధికారాలను పక్క నియోజకవర్గ ప్రజాప్రతినిధికి గాని, అంగీకరించినట్లయితే మీ లోక్ సభ సభ్యుడికి గాని అప్పగించబడును.
ఓటరు మహాశయులు తలా పది రూపాయలు కూడబెట్టి తమ అభివ్రుద్ధిని సాధించుకునే అవకాశము కలిగించే పార్టీ బహుజన రాష్ట్ర సమితి
మహాత్మా ఫూలే మహాశయుని ఆదర్శాలతో స్ఫూర్తి పొందిన అంబేద్కర్ అన్నాడు, అణగారిన ప్రజల అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే కావాలి
జై మహాత్మా జోతిరావ్ ఫూలే! జై బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్!!

విద్య లేక మతి (వివేకం) తగ్గింది; మతి లేక నీతి తగ్గింది

నీతి లేక పురోగతి తగ్గింది; పురోగతి లేక విత్తం (సంపద) తగ్గింది
విత్తం లేక శుద్రులు నాశనం అయ్యారు
ఇంత అనర్థమూ ఒక్క అవిద్య వల్లనే జరిగింది.

  • Jotibaa Phule in his Manuscript of “Shetkaryaacha Asood” (Cultivators Whip Cord)

Forget God!!! Think about Man!!!

  • Periyar E.V.Ramasamy