Our Organisation

President: No:Pub/HB I
M.R.ASHOK KUMAR 8121171208 Plot No. 34/2, Lalithanagar,
Vice President: West Marredpally,
SUDARSHAN KODIMELA, 9032229299
General Secretary: 

కర పత్రము
సామాజిక న్యాయం లో పూర్తిగా అన్యాయమయ్యింది బీసీలే. అంబెడ్కర్ ని అనుసరించకపోవడం వల్ల చాలా నష్టపోయాం. బీసీలు మేము కూడా ఆత్మ గౌరవంతో జీవిస్తాం అని ఇవ్వాళ నినదిస్తున్నారు. భౌగోళిక తెలంగాణ లో సామాజిక న్యాయం కోసం అణచివేతకు, పీడనకు గురైన బీసీ దళిత మైనారిటీ వర్గాలు సమిష్టిగా జనాభా దామాషా ప్రకారము తమ అధికారాలను రాజకీయ ప్రక్రియ ద్వారా సాధించుకోవాలసిందే. తెలంగాణ డిమాండ్, సామాజిక తెలంగాణ అంశము అవిభాజ్యమైనవి. భూమి, విద్య, వైద్యం, ఉపాధి, గౌరవ ప్రదమైన జీవితం అందరికీ హక్కుగా దక్కాలి. కానీ పాలకులతో బాటు అగ్ర కులాల సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయాలను విశ్వవిద్యాలయాలలో బోధించేవారు కూడా ఈ విషయాన్ని గమనించనట్లుగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి రిజర్వేషనులు లేకపోవడం తో తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం కూడా బీసీలు నిత్యం కొట్లాడాల్సి వస్తోంది. తెలంగాణ రాకుంటే మన పరిస్థితి అధోగతి అన్న నమ్మకంతోనే బీసీలు అందరితోబాటు తెలంగాణ ఉద్యమములో ప్రాణాలకు తెగించి పాలుగోన్నారు. తమ ఉద్యోగాలు వదిలిపెట్టి పోరాడినవాళ్లు కొందరైతే తమ రోజువారీ కూలీలు వదలిపెట్టుకొని కొందరు, తమ పిల్లల భవిష్యత్తు కోసం కొందరు, తమ సమస్యలకు అన్నింటికీ తెలంగాణ సాధన ఒక్కటే పరిష్కారము అన్న ధీమాతో ప్రాణాలకు తెగించి పోరాడింరు. జరిగిందేమిటి? ఉద్యమకారులు త్యాగాలు చేస్తూ పోరాటం కొనసాగించిన సమయంలోనే ఉద్యమ నాయకులనేవాళ్ళు తమ జేబులు నింపుకున్నారు. వాళ్ళు అధికార పీఠం ఆరోహిస్తే ఇంకొందరు అధికారం కోసము తమదంటూ ఇంకొక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని అధికార పీఠం మీద వున్నవాళ్లను పడద్రోసి ఆ స్థలము ఆక్రమిద్దామన్న ఆలోచనలో వున్నారు. వీళ్ళు మన శిరస్సుల మీద నుండి నడుస్తూ పొయ్యి అధికార పీఠాన్ని ఆక్రమించినవాళ్లు కొందరైతే, కొత్తగా మనల్ని మోసగిస్తూ తాము ఆ పీఠాన్ని అధిరోహించాలని చేస్తున్నవాళ్లు కొందరు. ఇది ప్రజాస్వామ్యము అన్న విషయము బీసీలు అందరూ గమనించి అధిక సంఖ్యాకులు అధికార పీఠానికి అరుహులు, అధికారం అంటే వడ్డించేవాళ్ళు అని గుర్తించి, వడ్డించేవాడు మనవాడైతే . . . అన్న సామెత ప్రాముఖ్యతను తెలుసుకొని ఐక్యంగా బహుజనుల పరిపాలనాధికారము సాధించుకుంటేనే బహుజనులు బానిసత్వము నుండి విముక్తి పొందగలరని గుర్తించి, విశ్వసించి, మనము రాజకీయంగా బలంగా ఎదిగే ప్రయత్నము చెయ్యాలని బహుజన రాష్ట్ర సమితి యొక్క వినమ్రపూర్వక మనవి. C/o to Page 2.
Page 2.
అధిక సంఖ్యాకులు అధికారం నుండి వంచితులవుతున్నారు. కారణం, మన ప్రజాస్వామ్యము రాజకీయ పార్టీల ద్వారా నిర్వహించబడడమే. రాజకీయ పార్టీలన్నీ అధిక శాత ప్రజలను తొక్కిపెట్టాలన్న కోరికతో వున్న వర్గాలవారి ఆధీనంలో వున్నాయి. కాబట్టి అధికశాతం వున్న బహుజనులకు దేశ రాజకీయ ప్రక్రియలో తమకు చెందాల్సిన తమ వాటా పదవులు దక్కనియ్యకుండా, అగ్రవర్ణాల వారు శాశ్వతంగా తాము శాసించే వాళ్లుగాను బహుజనులను పాలితులుగా కొనసాగేలాగా కుట్రలు చేస్తున్నారు. వర్గ శత్రువులు వాళ్లకు వంత పాడుతున్నారు. ఇంకొక పక్క దళిత సోదరులు మనం రాజకీయ శక్తిగా ఎదగడం వల్ల తమ ప్రాధాన్యత ఎక్కడ తగ్గుతుందో అన్న భయం కొద్దీ ఇష్టపడడంలేదు. ఇన్ని వ్యతిరేకతల మధ్య మనకోసమంటూ మనవారితో, మనదైన పార్టీ నిర్మాణము ఏర్పాటు చేసే దిశలో ఒక సాహసమైన అడుగు ముందుకు వేసింది మన “బహుజన రాష్ట్ర సమితి” రాజకీయ పార్టీ, కేంద్ర ఎన్నికల సంఘము లో పార్టీ నమోదు చెయ్యడము కోసము దరఖాస్తు కూడా పెట్టుకున్నది.
బహుజన రాష్ట్ర సమితి అట్టడుగు స్థాయి నుండీ ప్రజాస్వామ్య విలువలను అమలు పరుస్తూ కాపాడుకుంటుంది అని మనవి చేసుకుంటున్నాము. బహుజన రాష్ట్ర సమితి తమ పార్టీ నియమావళిలో ప్రజాప్రతినిధులందరికీ సమాన అధికారాలు ఉంటాయి అని, అవినీతికి పాలుపడిన వారి అధికారాలు పార్టీ ముఖ్యమంత్రి చేతికి పోతాయి అని స్పష్టపరుస్తున్నది. పార్టీ ఫిరాయింపుదారులు వెంబడే శాసనసభ సభ్యత్వాన్ని కోలుపోతారు అని బహుజన రాష్ట్ర సమితి పార్టీ నియమావళి స్పష్టపరుస్తున్నది.
బహుజన రాష్ట్ర సమితి తమ ప్రణాళికలను ప్రతీ రంగములోను సహకార సంఘాలను ప్రోత్సహిస్తూ, సామూహిక భోజనశాలలు, సామూహిక సాంఘిక కార్యక్రమాలు, సామూహిక వివాహాలు నిర్వహిస్తూ ప్రజలను బలోపేతము చేస్తూ ప్రజల జీవితాల్లోనూ, గ్రామ, పట్టణ, నగర, రాష్ట్ర అభివృద్ధిని సాధిస్తూ దేశాన్ని ప్రగతిపథంలో నడిపించాలని ఆశిస్తున్నది. ఈ దిశలో అడ్డంకులు కలిగేవి మనుష్యులలో ఉండే స్వార్థపరత్వమొక్కటే అని మన అనుభవాలు చెపుతున్నాయి. అవినీతి ఆరోపణలను అధిక సంఖ్యాకులు ఆమోదించాలన్న సూత్రమును పక్కన పెట్టి, ఆరోపణలను ఏ ఇద్దరు సమర్థించినా పదవీచ్యుతులవుతారు, తిరిగి ఆ పదవికి పోటీ చెయ్యడానికి ఆ వ్యక్తి అనర్హుడవుతాడు, అన్న సూత్రముతో బహుజన రాష్ట్ర సమితి సహకార సంఘాల నిర్వహణను బలోపేతము చేద్దామన్న ఆలోచన లో ఉన్నది.
బహుజన సోదరులకు వినమ్ర మనవి ఏమిటనగా, రాజకీయాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి మన భవిష్యత్తుకు మనమే బాధ్యులం అవుదాము, మన రాజకీయావసరాలను మనమే నిర్ణయించుకుందాము, బహుజన సోదరులారా ! ఐక్యంగా రాజకీయ శక్తిగా ఎదుగుదాం !! మన భవిష్యత్తును దేశ భవితవ్యాన్ని నిర్మిద్దాం !!!
జై బాబాసాహెబ్ అంబేద్కర్ ! జై మహాత్మా జోతిరావ్, సావిత్రిబాయి ఫూలే !!